తెలంగాణ: కరోనా పరిస్థితులపై హైకోర్టుకు నివేదిక సమర్పించిన ప్రభుత్వం
- April 27, 2021
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టుకు నివేదిక సమర్పించింది తెలంగాణ ప్రభుత్వం. ఈనెల 1 నుంచి 25 వరకు రాష్ట్రంలో 23.55 లక్షల కరోనా పరీక్షలు చేసినట్లు చెప్పిన ప్రభుత్వం అందులో 4.39 లక్షల ఆర్ టి పీసీఆర్, 19.16లక్షల రాపిడ్ పరీక్షలు ఉన్నట్లు తెలిపింది.ఇక ఈ నెల 1 నుంచి 25 వరకు 341 మంది కరోనాతో మృతి చెందినట్లు అలాగే కరోనా పాజిటివ్ రేటు 3.5% ఉంది అని ప్రభుత్వం తెలిపింది. పరీక్షలు ఇంకా పెంచేందుకు చర్యలు చేపడుతున్నాం. నిపుణుల కమిటీ సమావేశాలు ఆన్ లైన్ లో జరుగుతున్నాయి. మద్యం దుకాణాలు, బార్లు, పబ్ లు కోవిడ్ నిబంధనలు పాటించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాము. మద్యం దుకాణాలను ఆబ్కారీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు అని పేర్కొంది. రాష్ట్రానికి 430 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేంద్రం కేటాయించింది. ఇంకా వివిధ ప్రాంతాల నుంచి ఆక్సిజన్ చేరవేస్తున్నాం.రేమిడివిసిర్ సరఫరా పర్యవేక్షణకు ప్రీతిమీనాను నోడల్ అధికారిగా నియమించాం అని ప్రభుత్వం తెలిపింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







