అబుధాబిలో రోడ్డు ప్రమాదం: ఐదుగురి దుర్మరణం

- April 27, 2021 , by Maagulf
అబుధాబిలో రోడ్డు ప్రమాదం: ఐదుగురి దుర్మరణం

యూఏఈ: ఓ ఎమిరేటీ వ్యక్తి, ఓ అరబ్ మహిళ, ముగ్గురు ఆసియా జాతీయులు ఓ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అల్ దఫ్రా గవర్నరేట్ పరిధిలో ఈ ప్రమాదం జరిగిందని అబుదాబీ పోలీసులు పేర్కొన్నారు. రెండు వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. అబుదాబీ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనాల్ని అత్యంత అప్రమత్తంగా నడపాలనీ, మరీ ముఖ్యంగా జంక్షన్ల వద్ద జాగ్రత్తగా వుండాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు. అలసిపోయిన పరిస్థితుల్లో వాహనాలు నడపడం శ్రేయస్కరం కాదని పోలీసులు హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com