ఈరోజు నుంచి వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్...

- April 28, 2021 , by Maagulf
ఈరోజు నుంచి వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్...

న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది.ఇప్పటి వరకు 45 ఏళ్ళు నిండిన వ్యక్తులకు వ్యాక్సిన్ అందిస్తూ వస్తున్నారు.కాగా, మే 1 వ తేదీ నుంచి 18 ఏళ్ళు నిండిన వారికి వ్యాక్సిన్ అందించే కార్యక్రమం ప్రారంభం కాబోతున్నది.కాగా, దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఈరోజు నుంచి ప్రారంభించబోతున్నారు.ఆరోగ్యసేతు, కోవిన్ యాప్ ద్వారా వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.  కాగా, ఈ వ్యాక్సిన్ ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆసుపత్రుల్లోనే కాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా వ్యాక్సిన్ అందించబోతున్నారు.ఇప్పటికే అనేక రాష్ట్రాలు వ్యాక్సిన్ ఫ్రీ అని  ప్రకటించాయి.ఉత్పత్తి దారుల నుంచి పెద్ద ఎత్తున వ్యాక్సిన్ కొనుగోలుకు ఒప్పందాలు చేసుకుంటున్నాయి.అటు కేంద్రం కూడా కొనుగోలు చేసిన వ్యాక్సిన్ ను రాష్ట్రాలకు ఉచితంగా అందించబోతున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com