భార‌త్ కు అన్ని విధాల సాయం అందిస్తాం: కువైట్

- April 28, 2021 , by Maagulf
భార‌త్ కు అన్ని విధాల సాయం అందిస్తాం: కువైట్

కువైట్ సిటీ: కోవిడ్ వేరియంట్ వైర‌స్ తో స‌త‌మ‌తం అవుతోన్న భార‌త్ కు తాము అన్ని విధాల అండ‌గా ఉంటామ‌ని కువైట్ ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు కువైట్ కేబినెట్ వ్య‌వ‌హారాల మంత్రి షేక్ డాక్టర్ అహ్మద్ నాజర్ అల్-మహ్మద్ అల్-సబా..భార‌త విదేశాంగ మంత్రి జైశంక‌ర్ కు ఫోన్ చేసి మాట్లాడారు. కోవిడ్ కార‌ణంగా మృతి చెందిన వారి కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి వ్య‌క్తం చేశారు. కువైట్‌- భార‌త్ మైత్రి బంధాన్ని చాటేలా ప్ర‌స్తుత క్లిష్ట ప‌రిస్థితుల్లో తాము అన్ని విధాల సాయం అందిస్తామ‌ని మంత్రి అన్నారు. ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌తో పాటు ఇథ‌నాల్ కు భార‌త్ కు పంపించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. 

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com