అపాయింట్మెంట్ ఉంటేనే వ్యాక్సిన్..ఖతార్ క్లారిటీ
- April 28, 2021
దోహా: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందస్తుగా అపాయింట్మెంట్ తీసుకోవాలని ఖతార్ ప్రభుత్వం ప్రజలకు మరోసారి గుర్తు చేసింది. అపాయింట్మెంట్ లేకుండా నేరుగా వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లటం వల్ల ఉపయోగం ఉండదని కూడా స్పష్టం చేసింది. అంతేకాదు..ప్రభుత్వం సూచించిన కోవిడ్ వ్యాక్సిన్ మార్గదర్శకాల మేరకు వ్యాక్సిన్ తీసుకునేందుకు అన్ని అర్హతలు ఉన్న వారికే ప్రాధాన్యం ఉంటుంది. ఖతార్ నేషనల్ కన్వెన్షన్ సెంటర్, ఇండస్ట్రియల్ ఏరియాలోని వ్యాక్సినేషన్ సెంటర్లు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎలిజిబుల్ వ్యక్తులు ముందుస్తుగా అపాయింట్మెంట్ తీసుకొని వెళ్లాలని అధికారులు సూచించారు. అయితే..డ్రైవ్ త్రూ వ్యాక్సిన్ సెంటర్లో కేవలం రెండో డోస్ మాత్రమే ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. డ్రైవ్ త్రూ వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లేవారు ముందస్తుగా అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా వెల్లడించింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







