సన్‌రైజర్స్ హైదరాబాద్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- April 28, 2021
న్యూ ఢిల్లీ: మరోసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఖాతాలో మరో పరాజయాన్ని వేసుకుంది. ఢిల్లీ వేదికగా ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ తో జారొగొన మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి సన్‌రైజర్స్ 171 పరుగులు చేసింది. జట్టు కెప్టెన్ వార్నర్(57), మనీష్ పాండే(61) అర్ధశతకాలతో మెరవగా చివర్లో విలియమ్సన్ (26) రాణించాడు. ఇక 172 పరుగుల లక్ష్యంతో వచ్చిన చెన్నై జట్టులో ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (75), ఫాఫ్ డు ప్లెసిస్(56) హాఫ్ సెంచరీలు పూర్తి చేసి మొదటి వికెట్ కు 129 పరుగుల భాగసౌమ్యని నెలకొల్పారు. అయితే 13 ఓవర్లో గైక్వాడ్ ను వెన్నకి పంపిన రషీద్ ఖాన్ ఆ తర్వాత 15 ఓవర్లో వరుసగా మొయిన్ అలీ, డుప్లెసిస్ ను ఔట్ చేసి చెన్నైని కొత్త కంగారు పెట్టాడు. అయితే అప్పటికే విజయానికి చేరువైన జట్టును రైనా, జడేజా కలిసి విజయతీరాలను దాటించారు. దీంతో చెన్నై ఐపీఎల్ 2021లో 5వ విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకోగా హైదరాబాద్ 5వ ఓటమితో చివర్లో నిలిచింది.
తాజా వార్తలు
- రాజ్‌కోట్ హైవేపై ఘోర ప్రమాదం..నలుగురు సజీవ దహనం
- ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం
- చైనాలో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- ప్రయాణికులకు మద్దతు..ఖతార్ రైల్ సన్‌ఫ్లవర్ ప్రోగ్రామ్..!!
- సాహెల్ యాప్ ద్వారా దేశీయ డ్రైవర్ వీసా సేవలు..!!
- దుబాయ్‌లోని దుకాణ యజమానులకు సైన్ బోర్డు రూల్స్..!!
- రియాద్‌లో జీసీసీ మంత్రుల అత్యవసర సమావేశం..!!
- ఏడాదిలో ఏడు కంటే ఎక్కువ ఉద్యోగాలను కలిగి ఉండటంపై నిషేధం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన జీసీసీ జుడిషియల్ మీటింగ్..!!
- యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ ఎమిర్ మధ్య టెలిఫోన్ సంభాషణ









