రేపటి నుంచి పాస్‌పోర్ట్ సేవలు బంద్
- April 28, 2021
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి వచ్చే నెల 14 వరకు పాస్‌పోస్టు సేవలు నిలిచిపోనున్నాయి.కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వం పాస్‌పోర్టు సేవలను నిలిపివేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలోని 14 తపాలా సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వం పాస్‌పోస్టు సేవలను అందిస్తున్నది. తాజా నిర్ణయంతో ఇవన్ని గురువారం నుంచి మూతపడనున్నాయి.అలాగే రాష్ట్రంలోని ఐదు పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో హైదరాబాద్‌లోని బేగంపేట్, అమీర్‌పేట్, టోలీచౌకీ, నిజామాబాద్, కరీంనగర్ సేవలు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు. రాష్ట్రంలోని 14 తపాలా కార్యాలయాల ద్వారా అందించే సేవలను మాత్రమే నిలిపివేసినట్లు స్పష్టం చేశారు.
విషయాన్ని గమనించి దరఖాస్తు దారులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మే 14 తరువాత పరిస్థితులకు అనుగుణంగా పాస్‌పోర్టు సేవాలను తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్‌కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్‌లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







