కూకట్‌పల్లి కాల్పుల్లో ఒకరు మృతి:సీపీ సజ్జనార్
- April 29, 2021
హైదరాబాద్: హైదరాబాద్ కూకట్‌పల్లిలో దుండగుల కాల్పుల్లో గాయపడ్డ అలీ మృతి చెందాడు. ఏటీఎం మిషన్‌లో డబ్బులు రీఫిల్ చేస్తుండగా కాల్పులు జరిపిన ఆగంతకులు డబ్బులతో పరారయ్యారు.అయితే.. ఆగంతకుల కాల్పుల్లో అలీ పొట్టలోకి దూసుకెళ్లింది బుల్లెట్.. దీంతో.. ఆయన మృతిచెందినట్టు సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియాకు తెలిపారు. ఇక, ఈ ఘటనతో రంగంలోకి దిగిన సైబరాబాద్ పోలీసులు.. పూర్తిస్తాయిలో దర్యాప్తు ప్రారంభించారు.ఇది పాత నేరస్థుల పనే అంటున్నారు సీపీ సజ్జనార్.. కాల్పులు జరిపి 5 లక్షల రూపాయలతో దుండగులు పరారయ్యారన్న ఆయన... కాల్పులు జరిపిన ఒక మ్యాగజైన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.పల్సర్ బైక్ పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు ఈ ఘటనకు పాల్పడ్డారని.. వారి వయస్సు 25 నుండి 30 సంవత్సరాల వరకు ఉంటుందన్నారు.దోపిడీకి కంట్రీ మేడ్ రివాల్వర్ వాడారని.. ఇది బయట గ్యాంగ్ పనే అని అనుమానాన్ని వ్యక్తం చేశారు సీపీ.. కాల్చిన తీరు చూస్తే వాళ్లు పక్క ప్రొఫెషనల్స్ గా తెలుస్తుందన్నాయన.. ఇప్పటికే మొత్తం ఆరు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశాం.. ఖచ్చితంగా పట్టుకుంటామని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం
- యూఏఈలో త్వరలో స్టార్‌లింక్.. ముందస్తు బుకింగ్ ఎలాగంటే?
- ఖతార్‌లో వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం 2026..!!
- బహ్రెయిన్‌లోని రిఫాలో ట్రాఫిక్ రద్దీకి చెక్..!!
- గల్ఫ్ పౌరుడి హత్య కేసులో బంగ్లాదేశీయుడు అరెస్ట్..!!
- సౌదీలో ఉరుములు.. భారీ వర్షాలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ఒమన్ అక్రాస్ ఏజెస్ మ్యూజియంలో అరుదైన ఘనత..!!
- వరద ముంచుకొస్తున్న వేళ..1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన నేపాల్ పాఠశాల ప్రిన్సిపాల్
- దోహాలో ICBF ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
- నేపాల్-టిబెట్ వరదల్లో 750కు చేరిన మృతుల సంఖ్య.. 3,044 మంది గల్లంతు







