భారత్-యూఏఈ ట్రావెల్ బ్యాన్ పొడిగింపు
- April 29, 2021
యూఏఈ: భారత్ లో రికార్డ్ స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో భారత్ పై ట్రావెల్ బ్యాన్ ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది యూఏఈ. మరో పది రోజుల పాటు అంటే..మే 14 వరకు భారత్ నుంచి విమానాలను అనుమతించబోమని స్పష్టం చేసింది.అలాగే..ఇతర దేశాల నుంచి వచ్చే వారు కూడా ప్రయాణానికి 14 రోజుల్లోపు భారత్ లో పర్యటించినట్లైతే వారికి కూడా ట్రావెల్ బ్యాన్ అంక్షలు వర్తిస్తాయి. అయితే..రెండు దేశాల దౌత్యవేత్తలు, ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తల విమానాలకు ట్రావెల్ బ్యాన్ వర్తించదని స్పష్టం చేసింది. అలాగే గోల్డెన్ రెసిడెన్సీ హోల్డర్స్ కి కూడా ఆంక్షలు వర్తించవు. అయితే..వీరంతా కోవిడ్ ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలని, యూఏఈకి చేరుకోగానే పీసీఆర్ టెస్ట్ చేయించుకోవటంతో పాటు పది రోజులు క్వారంటైన్ లో ఉండాలని సూచించింది. దేశంలో అడుగుపెట్టిన నాటి నుంచి నాలుగో రోజు, ఏనిమిదో రోజు పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని పేర్కొంది యూఏఈ.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్: కొలంబో నుండి కువైట్‌కు వారానికి 6 విమానాలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!







