రానాతో పాన్ ఇండియా మూవీ!
- April 30, 2021
హైదరాబాద్: కొత్తదనంతో కూడిన వైవిధ్యమైన కథలు, విలక్షణ పాత్రలను ఎంపిక చేసుకొనే కథానాయకుడు రానా దగ్గుబాటి. ఇప్పటికే 'బాహుబలి, ఘాజీ, అరణ్య' వంటి పాన్ ఇండియా మూవీస్ చేసిన రానా మరో పాన్ ఇండియా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విశ్వశాంతి పిక్చర్స్ అధినేత ఆచంట గోపీనాథ్ ఈ సినిమాను సిహెచ్ రాంబాబుతో కలిసి నిర్మించబోతున్నారు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న పవన్ కళ్యాణ్, రానా మూవీ షూటింగ్ పూర్తి కాగానే, రానాతో ఈ సినిమాను ప్రారంభిస్తామని నిర్మాతలు తెలిపారు. 'టాప్ హీరో, దేవుడు, జంబలకిడి పంబ, ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్' వంటి చిత్రాలు గతంలో నిర్మించిన ఆచంట గోపీనాథ్ ఆ మధ్య నయనతార నటించిన తమిళ చిత్రం 'ఇమైక్క నోడిగల్'ను 'అంజలి సీబీఐ'గా తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. కాస్తంత విరామం తర్వాత రానాతో ఈ పాన్ ఇండియా మూవీని నిర్మిస్తుండటం ఆనందంగా ఉందని, ఇప్పటికే కథ ఓకే అయ్యిందని, కథ, కథనం, కథానాయకుడి పాత్రచిత్రణ కొత్తగా ఉంటాయని ఆచంట గోపీనాథ్ చెబుతున్నారు.
తాజా వార్తలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!







