భారత్ నుంచి ప్రయాణాలపై అమెరికా ఆంక్షలు
- May 01, 2021
అమెరికా: భారత్ నుంచి ప్రయాణాలపై అమెరికా ఆంక్షలు విధించింది.వచ్చే వారం నుంచి ఇవి అమలులోకి వస్తాయని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి తెలిపారు. మే 4 నుంచి అమలులోకి వస్తున్నట్టు కూడా చెప్పారు. తమ దేశ అంటువ్యాధుల నివారణా కేంద్రం సలహాపై ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.భారత్ లో కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని, పైగా వివిధ వేరియంట్లను కూడా నిపుణులు కనుగొన్నారని ఆమె చెప్పారు. ఇటీవలే అమెరికా భారత దేశంలో ఉన్న అమెరికన్లను ఆ దేశం వదిలి రావాలంటూ 4 ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. అలాగే ఇండియాకు వెళ్లరాదని కూడా అమెరికన్లను కోరింది. తాజా ప్రతిపాదనపై బైడెన్ ప్రభుత్వం లాంఛనంగా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై జర్మనీ, ఫ్రాన్స్,కెనడా,యూకే,వంటి దేశాలు ఆంక్షలు విధించా సంగతి తెలిసిందే.హాంకాంగ్,న్యూజిలాండ్, సింగపూర్ వంటి దేశాలు కూడా భారత్ నుంచి వచ్చే విమాన సర్వీసులపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
భారత్ నుంచి, భారత్ కు వెళ్లే అన్ని అంతర్జాతీయ విమానాల నిలిపివేతను డీజీసిఏ మే 31 వరకు పొడిగించింది. కాగా దేశంలో కోవిడ్ కేసులు వచ్చేవారం మరింత పెరగవచ్చునని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గతంలో కన్నా ఇప్పుడు వైరస్ వేగంగా విస్తరిస్తోందని అంటున్నారు.అటు వరుసగా 9 రోజులుగా భారత్ లో కేసులు 3 లక్షలకు పైగా నమోదవుతున్నాయి.నిన్న 3.86 లక్షల కేసులు నమోదయ్యాయి.శనివారం నుంచి 18 ఏళ్లకు పైగా వయస్సు పైబడినవారికందరికీ యుధ్ధ ప్రాతిపదికన టీకామందులు వేసే కార్యక్రమం ప్రారంభం కానుంది .
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







