తెలంగాణ కరోనా అప్డేట్

- May 01, 2021 , by Maagulf
తెలంగాణ కరోనా అప్డేట్

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి.కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అనేక ఆంక్షలు అమలు చేస్తున్నారు.  శనివారం రోజున రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం కొత్తగా 7,754 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,43,360కి చేరింది.  ఇందులో 3,62,160 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 78,888  కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక కరోనాతో రాష్ట్రంలో కొత్తగా 51 మంది మృతి చెందారు.దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 2312కి చేరింది.  

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com