హైదరాబాద్ చేరిన రష్యా వ్యాక్సిన్ 'స్పుత్నిక్-వి'
- May 01, 2021
దిల్లీ: రష్యా అభివృద్ధి చేసిన కరోనా టీకా స్పుత్నిక్-వి డోసులు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్నాయి. 1.5-2 లక్షల వయల్స్ తొలి విడతలో భారత్‌కు చేరుకోనున్నట్లు ఇటీవలే రష్యాలోని భారత రాయబారి బాల వెంకటేశ్ వర్మ తెలిపారు. నేటి నుంచి మూడో విడత వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కావడం.. మరోవైపు టీకాల కొరత వేధిస్తున్న తరుణంలో స్పుత్నిక్-వి టీకాలు భారత్ చేరుకోవడం ఊరట కలిగించే అంశం. ఇక ఈ నెలలోనే భారత్‌లో ఈ టీకా ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు సమాచారం. దేశీయంగా స్పుత్నిక్-వికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్‌ను ప్రముఖ ఔషధ తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ చేపట్టిన విషయం తెలిసిందే.
రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ ఫండ్(ఆర్డీఐఎఫ్) సహకారంతో గమలేయా ఇన్స్టిట్యూట్ తయారు చేసిన స్పుత్నిక్ టీకాను భారత్‌లో ఉత్పత్తి, పంపిణీకి గతేడాది సెప్టెంబర్‌లోనే డాక్టర్ రెడ్డీస్‌తో ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా.. రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ దాదాపు 1600 మంది వాలంటీర్లపై నిర్వహించిన డాక్టర్ రెడ్డీస్, అనుమతి కోసం డీసీజీఐకు దరఖాస్తు చేసుకుంది. వీటి ఫలితాల సమాచారాన్ని విశ్లేషించిన నిపుణుల కమిటీ.. భారత్‌లో అత్యవసర వినియోగానికి ఏప్రిల్ 12న పచ్చజెండా ఊపింది. మరోవైపు ఇప్పటికే కొవిషీల్డ్, కొవాగ్జిన్లు భారత్‌లో వినియోగిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- 3D మెరైన్ సర్వే ప్రాజెక్ట్ కోసం కొత్త వర్క ఏరియా:కోస్ట్ గార్డ్
- యూఏఈలో మొహర్రం ఆరంభం..!!
- కువైట్ T4 టెర్మినల్ ద్వారా ఆపరేషన్స్ పునఃప్రారంభం..!!
- MENAలో అత్యంత శాంతియుత దేశంగా ఖతార్..!!
- బురైదాలో నలుగురి ప్రాణాలను కాపాడిన సౌదీ బాలుడు..!!
- ఒమన్ లో పిల్లల సోషల్ మీడియా వినియోగం పై అధ్యయనం..!!
- ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్‌ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్!
- సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- అభిజీత్ దిప్కే పై దాడి..









