ప్రార్థనల కోసం రోడ్డుపై వాహనాలు పార్కింగ్ చేసేవారికి దుబాయ్ పోలీస్ హెచ్చరిక
- May 01, 2021
దుబాయ్: రమదాన్ సందర్భంగా చివరి పది రోజుల్లో రాత్రి వేళ చేసే తహజ్జుద్ ప్రార్థనల విషయమై వాహనదారులు, భద్రతా పరంగా సరైన ప్రాంతాలను ఎంచుకోవాలని దుబాయ్ పోలీస్ సూచించడం జరిగింది. జనరల్ ట్రాఫిఖ్ డిపార్టుమెంట్ - దుబాయ్ పోలీస్ డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ సైఫ్ ముహైర్ సయీద్ అల్ మజ్రోయి మాట్లాడుతూ, పలువురు వ్యక్తులు రోడ్డు మీద, వీధుల్లో మసీదుల పక్కనే తమ వాహనాల్ని పార్కింగ్ చేస్తున్నారని అన్నారు. ఈ చర్యలు ఇతరుల ప్రాణాలకు ప్రమాదకరంగా మారతాయని చెప్పారాయన. ప్రార్థనలు నిర్వహించేవారికి కూడా ఇది ఇబ్బందికరమని అన్నారు. వాహనాల్ని పరిమిత వేగంతోనే మసీదుల వద్ద నడపాల్సిందిగా అల్ మజ్రోయి చెప్పారు. పోలీస్ పెట్రోల్స్ ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించడం జరుగుతుందనీ, ఉల్లంఘనులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







