కార్మికులకు శుభాకాంక్షలు తెలిపిన మున్సిపాలిటీ, పర్యావరణ శాఖ మంత్రి
- May 02, 2021
దోహా: మే డే సందర్భంగా కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు పురపాలక, పర్యావరణ శాఖ మంత్రి అబ్ధుల్లా బిన్ అబ్ధుల్లాజిజ్ బిన్ టర్కీ అల్. ఈ సందర్భంగా ఆయన కార్మికుల సేవలను కొనియాడారు. ఖతార్ పురోభివృద్ధిలో తమ మంత్రిత్వ శాఖలోని కార్మికుల కృషి అభినందనీయమని అన్నారు. మంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాలకు చెందిన కార్మికులకు ధన్యవాదాలు తెలియజేశారు. కోవిడ్ సమయంలో మున్సిపాలిటీ కార్మికులు అందించిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేమని ప్రశంసించారు. కోవిడ్ ను సమర్ధవంతంగా అరికట్టడంలో మరింత అంకిత దీక్షతో పని చేయాలని పిలుపునిచ్చారు. ఊరెడూ అనే సంస్థ సౌజన్యంతో మున్సిపాలిటీ, పర్యావరణ శాఖలోని పలువురు ఉత్తమ కార్మికులను మంత్రి సత్కరించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- దుబాయ్ గురునానక్ దర్బార్ గురుద్వారా సాధారణ వేళల పునరుద్ధరణ
- దుబాయ్లో 59% తగ్గనున్న బస్ ట్రావెల్ టైమ్..!!
- కువైట్ ఆసుపత్రులలో క్వైయిట్ అవర్స్..!!
- సౌదీ అరేబియాలో పబ్లిక్ హెల్త్.. 2030 టార్గెట్ ముందుగానే రీచ్..!!
- ఖరీఫ్ ప్రారంభం..విజిటర్స్ కు ధోఫార్ స్వాగతం..!!
- ఖతార్ లో 'ఆపిల్ పే' ద్వారా ATM నుండి విత్ డ్రా..!!
- కొత్తగా ప్రాభించిన ఫ్లైఓవర్ పై భద్రతా పరమైన హెచ్చరికలు..!!
- రెడ్ సిగ్నల్ ఉల్లంఘనలపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక..
- ఫిక్స్డ్ అడ్మిషన్ పీరియడ్’తో మారనున్న వీసా రూల్స్..
- ప్రతి పోలీసు అధికారి యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి: సైబరాబాద్ సీపీ







