మూడు గెటప్స్‌లో హీరో కళ్యాణ్ రామ్!
- May 02, 2021హైదరాబాద్: మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. కల్యాణ్‌రామ్‌కి ఇది 19వ సినిమా. నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. ఈ సినిమాతో రాజేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కాగా ఈ సినిమాకి 'ఎమిగోస్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. 'ఎమిగోస్' అంటే తెలుగులో స్నేహితులు అని అర్థం. ఈ చిత్రంలో కల్యాణ్‌రామ్ మూడు పాత్రల్లో కనిపిస్తారని ప్రచారం సాగుతోంది. ఇక ఇందులో కథానాయిక కోసం అన్వేషణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటివరకు నందమూరి హీరోలందరూ త్రిపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కళ్యాణ్ రామ్ కూడా ఆ జాబితాలో చేరే అవకాశం కనిపిస్తోంది.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..