గూగుల్‌‌ కీలక నిర్ణయం...

- May 03, 2021 , by Maagulf
గూగుల్‌‌ కీలక నిర్ణయం...

టెక్నాలజీ రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. కొత్త యాప్‌లు అందుబాటులోకి వస్తున్నాయి.అదే అదనుగా వాటితో పాటు నకిలీ యాప్స్‌ కూడా పుట్టుకొస్తున్నాయి.నిజమైన యాప్స్‌ ఏవో.. నకిలీవేవో తెలియని పరిస్థితి ఉంది. అవి తెలుసుకునేందుకు వీలు లేకుండా యాప్స్‌‌ను క్రియేట్‌‌ చేస్తున్నారు హ్యాకర్లు. అంతేకాకుండా కొన్ని స్పామ్‌‌ యాప్స్‌‌ కూడా సృష్టిస్తున్నారు.అలాంటి వాళ్లకు చెక్‌‌ పెట్టేందుకు గూగుల్‌‌ కీలక నిర్ణయం తీసుకుంటోంది.

ఈ నేపథ్యంలో గూగుల్‌ ప్లే స్టోర్‌‌‌‌ కొత్త గైడ్‌‌లైన్స్ తీసుకురానుంది.ఈ గైడ్‌‌లైన్స్‌‌ 2021 చివరి నాటికి అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు గూగుల్ తెలిపింది. యాప్‌‌ టైటిల్‌‌ను 30 క్యారెక్టర్లకు తగ్గిస్తుంది. అంతేకాకుండా యాప్‌‌‌‌ పనితీరును సూచించే కీ వర్డ్స్‌‌ను నిషేధిస్తుందట. ఐకాన్‌‌లో డెవలపర్‌‌‌‌ ప్రమోషన్‌‌ పేరును తొలగించనుంది. వినియోగదారులను తప్పుదారి పట్టించేలా యాప్‌‌ ఐకాన్‌‌పై ఇచ్చే గ్రాఫిక్స్‌‌ను కూడా నిషేధిస్తున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటుగా క్యాపిటల్‌‌ ఫాంట్స్‌‌ వాడకాన్ని, యాప్‌‌ పేరులో ఎమోజీలను వాడకూడదని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలను‌ పాటించని యాప్స్‌‌ను గూగుల్‌‌ ప్లే స్టోర్‌‌‌‌లోకి అనుమతించబోమని స్పష్టం చేసింది. లిస్టింగ్‌‌ ప్రివ్యూవ్‌‌కి సంబంధించి కూడా కొత్త ఎసెట్‌‌ గైడ్‌‌లైన్స్‌‌ విడుదల చేసింది. ఆ యాప్‌‌ను యూజర్స్‌‌ ఇన్‌‌స్టాల్‌‌ చేసుకోవచ్చా? లేదా? అనే విషయానికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని యాప్‌‌ డెవలపర్స్‌‌కు సూచించింది. అలాగే ప్రివ్యూవ్‌‌ ఎసెట్స్‌‌ కూడా జనాలకు అర్థమయ్యే విధంగా ఉండాలని గూగుల్‌ తెలియజేసింది. 2021 చివరి కల్లా ఈ గైడ్‌‌లైన్స్‌‌ అమల్లోకి వస్తాయని గూగుల్‌ తెలిపింది. దీనిపై మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com