కంగ‌నా ర‌నౌత్ ట్విట‌ర్ అకౌంట్ స‌స్పెండ్‌

కంగ‌నా ర‌నౌత్ ట్విట‌ర్ అకౌంట్ స‌స్పెండ్‌

ముంబై: బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ ట్విట‌ర్ అకౌంట్‌ను స‌స్పెండ్ చేసింది ట్విట్టర్. ఆదివారం ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల ఫ‌లితాల సంద‌ర్భంగా కంగ‌న అభ్యంత‌రక‌ర ట్వీట్లు చేయ‌డం వ‌ల్లే ఆమె అకౌంట్‌ను స‌స్పెండ్ చేశారు. ఇది ట్విట‌ర్ మార్గ‌దర్శ‌కాల‌ను ఉల్లంఘించ‌డ‌మే అవుతుంద‌ని ఆ సంస్థ స్ప‌ష్టం చేసింది. వెస్ట్ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీపై కంగ‌నా అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆమెను ఓ రాక్ష‌సిగా అభివ‌ర్ణించారు.

ప‌శ్చిమ బెంగాల్‌లో వెంట‌నే రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాల‌ని ఆమె డిమాండ్ చేసింది. అస్సాం, పుదుచ్చేరిల్లో బీజేపీ గెలిచినా అక్క‌డ హింస చెల‌రేగ‌లేద‌ని, ప‌శ్చిమ బెంగాల్‌లో మాత్రం టీఎంసీ హింస‌కు దిగుతోంద‌ని కంగ‌నా ట్వీట్ చేసింది. బెంగాల్ మంట‌ల్లో కాలిపోతోందంటూ కంగ‌నా ట్వీట్ చేయ‌డంపై ట్విట‌ర్ అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. త‌న ట్వీట్ల‌లో ఇందిరా గాంధీపై కూడా ఆమె ప‌లు కామెంట్లు చేసింది.

Back to Top