కోవిడ్‌ మహమ్మారిని ఎదుర్కోవడంపై చిట్కాలు: డా.రవి శంకర్‌ ఇరుకులపాటి

- May 04, 2021 , by Maagulf
కోవిడ్‌ మహమ్మారిని ఎదుర్కోవడంపై చిట్కాలు: డా.రవి శంకర్‌ ఇరుకులపాటి

కోవిడ్‌ వైరస్‌కు వ్యతిరేకంగా శరీరాన్ని మరియు మనస్సును సన్నద్దం చేయడం మరియు శాస్త్రీయ పద్ధతిలో రోగనిరోధకతను పెంచుకోవడం...

1.అనేక రకాలు వార్తలు మరియు ‘ఆరోగ్య చిట్కాు’ మన చుట్టూ చక్కర్లు కొడుతున్నాయ్. నిజమైన నిపుణుల సూచనలను మాత్రమే వినండి. ఈ సందర్భంలో సరైన అర్హత కలిగిన వైద్యులు మరియు శాస్త్రవేత్తల సూచనలను మాత్రమే పరిగణించాలని నిపుణులు సూచిస్తున్నారు!

2.మన అనవసర భయాలలో 99శాతం వరకు ఎప్పుడూ నిజం కాలేదు, అందుకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి మరియు కోవిడ్‌కు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది! ప్రతికూల ఆలోచనకు దూరంగా ఉండండి మరియు మీ వృత్తి లేదా అభిరుచులు లేదా కుటుంబంతో మిమ్మల్ని మీరు క్రియాశీలకంగా ఉంచుకోండి. ప్రస్తుతం, స్నేహితులు అనేవారు మన చుట్టూ తిరిగే అత్యుత్తమ వ్యక్తులు అయితే కాదు.

3.క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వలన శరీరం మరియు ఊపిరితిత్తులు మంచి ఆరోగ్యకరమైన స్థితిలోవుంటాయి! ఊబకాయం అనేది శరీరానికి హాని కలిగించవచ్చు, తద్వారా అది సమస్య ప్రమాదాన్ని పెంచడం మాత్రమే కాదు తద్వారా మరణానికి కూడా దారితీయవచ్చు, ఊబకా యులకు కోవిడ్‌ సంక్రమిస్తే,అది గుండెపోటుకు దారితీయడం, మెదడు కూడా దెబ్బతినడం వంటివి సంభవించవచ్చు. ప్రాణాయామం వంటి క్రమం తప్పకుండా చేసే శ్వాస వ్యాయామాలు కఠినమైన సవాళ్లను ఎదుర్కోవటానికి, ఊపిరితిత్తులను మరియు శరీరాన్ని సన్నద్దం చేయడానికి ఉపయోగపడతాయి!

4.అదే కారణాలతో, అదుపులో లేని అధిక రక్తపోటు మరియు చికిత్స అందించనటువంటి గుండె సమస్యలు వంటివి కూడా సురక్షితం కాదు!

5.డయాబెటిస్‌ ఉన్నవారు కోవిడ్‌కు గురైతే తీవ్రమైన కోవిడ్‌ వచ్చే ప్రమాదం ఉంటుంది. వారిలో గ్లూకోజ్‌ నియంత్రణ సరిగా లేనట్లయితే, వెంటిలేషన్‌, ఇంటెన్సివ్‌ కేర్‌ అవసరం కావచ్చు మరియు అది మరణానికి దారితీయవచ్చు.కాబట్టి, డయాబెటిస్‌ ఉన్నవారు బ్లడ్‌ గ్లూకోజ్‌ స్థాయిను వెంటనే నియంత్రించుకోండి.

6.ధూమపానం అనేది మనల్ని చంపుతుంది మరియు ధూమపానం చేసేవారిలో కోవిడ్‌ సంక్రమణ వలన అది సంతోషకరమైన ఫలితానికి దారితీయకపోవచ్చు. ధూమపానం ఆపడానికి ఇప్పటికీ సమయం మించి పోలేదు!

7.మనం తినేవాటిని బట్టి మనం ఉంటాము. తాజా పండ్లు మరియు కూరగాయలు అధికంగా ఉండే ఆరోగ్యకరమైన సమత్యుమైన ఆహారాన్ని తినండి.క్షమించండి, ‘హెర్బల్‌ రెమెడీస్‌కు అనవసరమైన ప్రాధాన్యత ఇచ్చి వాటిని అధికంగా తీసుకోవడం వలన శరీరానికి ఎటువంటి నిరూపితమైన విలువలు అందడం లేదు! సురక్షితంగా కనిపించే మూలికలు మరియు సహజ నివారణలు ‘ఎక్కువగా’ తీసుకోవడం వలన కిడ్నీలు మరియు కాలేయంతో సహా శరీరానికి అవి హాని కలిగిస్తాయి. మీ వరకు మీరు అనవసరమైన రిస్క్‌ తీసుకోవానుకుంటే! పారిశ్రామిక పరిమాణంలో కాకుండా, తక్కువగా మరియు సాధారణ వినియోగానికి మాత్రమే వాటిని పరిమితం చేయండి!

8.విటమిన్‌ - డి తక్కువ కావడం అనేది మనలోని రోగనిరోధక శక్తిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. మీరు పరీక్షించుకోవాలనుకుంటే, ల్యాబ్‌ ముందు పొడగాటి క్యూలు ఉన్నాయి. మండే నడి వేసవి వేడిలో బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు! మీరు వడదెబ్బను ఆహ్వానించాలనుకుంటే తప్ప! మీకు కిడ్నీ స్టోన్స్‌ లేదా ఇటీవలి కాలంలో విటమిన్‌ డి సప్లిమెంట్స్‌ను మీరు తీసుకోకపోయినట్లయితే మరియు కొన్ని వ్యాధులతో బాధపడకపోతున్నట్లయితే, కొన్ని విటమిన్‌-డి సప్లిమెంట్లను తీసుకోవడం మంచిది. ఇందుకు సంబంధించి మీరు మీ వైద్యుడితో మాట్లాడండి (అత్యవసరం అయితే కాదు!).

9.మల్టీవిటమిన్‌ సప్లిమెంట్స్‌ మరియు ఖనిజాల కాక్టెయిల్‌ అనేవి సమతుల ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేటటువంటి ఆరోగ్యకరమైన వ్యక్తులలో రోగనిరోధక శక్తిని పెంచుతున్నది అనడంలో ఎటువంటి నిరూపితమైన విలువ లేదు.ఇవన్నీ కూడా పబ్లిక్‌లో చాలా హైప్‌ చేయబడ్డాయి మరియు అధికంగా అమ్ముడవుతున్నాయి! చాలా తక్కువ మందికి మాత్రమే ఇవి అవసరం మరియు మీ డాక్టర్‌ మీకు ఈ విషయంలో మార్గనిర్దేశం చేయవచ్చు.

10.ఆహ్లాదకరమైన అనుభూతినిచ్చే ఆల్కాహాల్‌ తీసుకోవడం అనేది ఇమ్యునిటీని తగ్గించడంతో పాటు మీ శరీరాన్ని దెబ్బతీస్తుంది. కావున దానికి దూరంగా ఉండడం మంచిది!

11.ముఖ్యంగా, కోవిడ్‌ను నివారించడానికి నిరూపితమైన ఆయుధమైనటువంటి కోవిడ్‌ వ్యాక్సిన్‌ను తీసుకోండి, మీకు వ్యతిరేకత ఉంటే తప్ప.దీనికి సంబంధించి నా ఇతర పోస్ట్‌లను కూడా మీరు చూడవచ్చు. తగిన టీకా డోస్‌ తీసుకున్న తర్వాత కూడా మీకు కోవిడ్‌ సంక్రమించినప్పటికీ, కోవిడ్‌ తీవ్రతను, ఆసుపత్రిలో చేరడాన్ని మరియు మరణించే ప్రమాదాన్ని టీకా తగ్గిస్తుంది!

12.ప్రతిరోజూ కనీసం 6 నుండి 8 గంటల పాటు బాగా నిద్రపోండి.మంచి నాణ్యమైన నిద్ర మంచి ఆరోగ్యాన్ని పెంచుతుంది.రోగనిరోధక శక్తిని తక్షణమే పెంచే మ్యాజిక్‌ మాత్రలు అంటూ ఏమీ లేవు.అన్ని సమయాల్లో మరియు సీజన్లలో ఈ ఆరోగ్యకరమైన అవాట్లను అనుసరించడం అలవాటు చేసుకోండి మరియు సురక్షితంగా మరియు ఆరోగ్యంగా ఉండండి!

డా.రవి శంకర్‌ ఇరుకులపాటి(సీనియర్‌ ఎండోక్రినాజిస్ట్‌)

అపోలో హాస్పిటల్స్‌, జూబ్లీ హిల్స్‌,హైదరాబాద్ 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com