హోటళ్ళలో ఆక్యుపెన్సీ పెరుగుదల: క్వారంటైన్ ఎఫెక్ట్

హోటళ్ళలో ఆక్యుపెన్సీ పెరుగుదల: క్వారంటైన్ ఎఫెక్ట్

దోహా: తప్పనిసరి హోటల్ క్వారంటైన్ నేపథ్యంలో హోటళ్ళలో ఆక్యుపెన్సీ గణనీయంగా పెరిగింది. కోవిడ్ 19 నేపథ్యంలో ట్రావెల్ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. 2020 నాలుగో త్రైమాసికంలో 49 శాతం ఆక్యుపెన్సీ నమోదయ్యింది. యావరేజ్ డెయిలీ రేట్లు.. ఒక రూమ్ కోసం 537 ఖతారీ రియాల్స్ అలాగే, అందుబాటులో వున్న రూము రెవెన్యూ 263 ఖతారీ రియాల్స్ నమోదైంది. ఆరు దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు తప్పనిసరి హోటల్ క్వారంటైన్ నిబంధన విధించిన దరిమిలా హోటళ్ళలో రూములు నిండుతున్నాయి. 10 రోజుల క్వారంటైన్ విధిస్తున్నారు ప్రయాణీకులకి. కాగా, ల్యాడ్ ట్రాన్సాక్షన్ టికెట్ రేటు అత్యధికంగా అల్ మషాఫ్ ప్రాంతంలో 70 మిలియన్ ఖతారీ రియాల్స్ నమోదయ్యింది. అల్ వుకైర్ - వక్రా మునిసిపాలిటీలో ల్యాండ్ ట్రాన్సాక్షన్ చదరపు అడుగుకి 200 నుంచి 250 ఖతారీ రియాల్స్ ధర పలుకుతోంది. దోహా పరిసరాల్లోని కొన్ని మునిసిపాలిటీల్లో చదరపు అడుగుకి 140 ఖతారీ రియాల్స్ 300 ఖతారీ రియాల్స్ వరకు ధర పలుకుతోంది.

 

Back to Top