తొలగింపు నుంచి 16,000 మంది ఒమనీయులకి ఊరటనిచ్చిన మినిస్ట్రీ

తొలగింపు నుంచి 16,000 మంది ఒమనీయులకి ఊరటనిచ్చిన మినిస్ట్రీ

ఒమన్: 90కి పైగా కంపెనీలతో చర్చించి 16,000 మందికి పైగా ఒమనీ కార్మికులకి తొలగింపు నుంచి ఊరట కలిగించినట్లు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ వెల్లడించింది. మినిస్ట్రీ విడుదల చేసిన తొలి త్రైమాసిక రిపోర్టులో ఈ వివరాలున్నాయి. 21,000 మందికి పైగా ఒమనీయులు తమ ఉద్యోగాల్ని నిలుపుకోగలిగారు.వేతనాల్లో తగ్గింపులు, తొలగింపుల నుంచి వీరంతా ఉపశమనం పొందారు. 58 సంస్థలతో చర్చించి 16,671 మందికి ఊరట కలిగించగా, 15,386 మంది తిరిగి తమ ఉద్యోగాలు పొందగలిగారు. వేతనాల తగ్గింపు విషయమై 33 సంస్థలతో చర్చించి 9,212 మంది ఒమనీ కార్మికులకు ఊరట కలిగించారు. అందులో 6,142 మంది సేలరీ తగ్గింపు నుంచి ఉపశమనం పొందారు. జాబ్ సెక్యూరిటీ విధానం ద్వారా 5,711 మంది వర్కర్లు మేలు పొందారు.

Back to Top