ఏపీలో కర్ఫ్యూ షురూ...
- May 05, 2021
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ మొదలైంది.మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమలు జరుగుతుంది.మధ్యాహ్నం 12 గంటల తరువాత షాపులు బంద్ చేశారు.12 గంటల తరువాత షాపులను వ్యాపారాలు స్వచ్చందంగా మూసివేయగా,రోడ్డుపైకి వచ్చిన ప్రజలకు చెప్పి వెనక్కి పంపుతున్నారు.అనవసరంగా రోడ్ల మీదకు వచ్చిన వాహనాలను కూడా తిరిగి వెనక్కి పంపుతున్నారు.ఈరోజు వరకు ప్రజల్లో అవగాహనా కల్పిస్తామని, రేపటి నుంచి ఆంక్షలను కఠినంగా అమలు చేస్తామని చెప్తున్నారు పోలీసులు.మధ్యాహ్నం 12 గంటల నుంచి తిరిగి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది.రాత్రి సమయంలో నైట్ కర్ఫ్యూ, ఉదయం సమయంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమలులో ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే కార్యకలాపాలకు అనుమతి ఉండటం విశేషం.మొత్తం మీద 18 గంటలపాటు కర్ఫ్యూ అమలులో ఉంటుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







