కరోనా సెకండ్ వేవ్‌: ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేందుక ఆర్బీఐ ప్రకటించిన కీలక నిర్ణయం

- May 05, 2021 , by Maagulf
కరోనా సెకండ్ వేవ్‌: ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేందుక ఆర్బీఐ ప్రకటించిన కీలక నిర్ణయం

న్యూ ఢిల్లీ: కరోనా మహమ్మారి వల్ల దేశం ప్రజలు రకరకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని రిజర్వ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. కరోనా కాలంలో ఆర్థికవ్యవస్థను పట్టాలెక్కించేందుకు ఆర్బీఐ చాలా ప్రకటనలు చేసింది.

గత ఏడాదితో పోలిస్తే, ఈసారీ కరోనా వ్యాప్తి తీవ్రంగా, భారీగా ఉన్నా, దానితో పోరాడి, ఆర్థిక వ్యవస్థను కాపాడడానికి ప్రత్యేక వ్యూహం అవలంబిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ చెప్పారు.

ఈ ఏడాది రుతుపవనాలు సాధారణంగా ఉంటాయనే అంచనాలతో ఆహార పదార్థాల ధరలు అదుపులో ఉంటాయని కూడా ఆశిస్తున్నట్లు శక్తికాంత దాస్ చెప్పారు. ఎగుమతులతోపాటూ, విదేశీ మారక నిల్వలు కూడా పెరిగాయని, దానివల్ల భారత్ ఆత్మవిశ్వాసం పెరిగిందని ఆయన తెలిపారు. కరోనా సెకండ్ వేవ్‌తో పోరాడ్డానికి మద్దతు అందించేలా ఆర్బీఐ కొన్ని ప్రకటనలు కూడా చేసింది.

ఆర్బీఐ ముఖ్య ప్రకటనలు:
* వ్యాక్సీన్ తయారీకి, ఆస్పత్రుల్లో సౌకర్యాల కోసం బ్యాంకులు అదనపు రుణాలు అందిస్తాయి. కోవిడ్ లోన్ బుక్ కింద ఈ రుణాలు ఇస్తారు. ఈ సౌకర్యం వచ్చే ఏడాది వరకూ ఉంటుంది.
* హెల్త్ కేర్ కోసం ఆర్బీఐ రూ.50 వేల కోట్ల రూపాయల ఫండ్ ప్రకటించింది.
రూ.35 వేల కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీస్‌ను ఆర్బీఐ మరోసారి రెండు వారాల్లో కొనుగోలు చేస్తుంది.
* రాష్ట్రాలకు ఇచ్చే ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యంలో ఆర్బీఐ సడలింపు ఇచ్చింది. రాష్ట్రాలకు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని 36 రోజుల నుంచి 50 రోజులకు పెంచారు. వరుస ఓవర్ డ్రాఫ్టుల మధ్య కాల వ్యవధిని 14 రోజుల నుంచి 21 రోజులకు పెంచారు. ఇది సెప్టెంబర్ 30 వరకూ కొనసాగుతుంది. దీనివల్ల రాష్ట్రాలకు డబ్బులు తీసుకోవడం సులభం అవుతుంది.
* ప్రజల బ్యాంకింగ్ లావాదేవీలకు ఎలాంటి ఇబ్బందులూ రాకుండా ఆర్బీఐ చాలా రకాల వీడియో ఆధారిత కేవైసీ ఏర్పాటు చేసింది.
* ఆర్బీఐ చిన్న పరిశ్రమల కోసం విడిగా రుణాలు ఇచ్చే ఏర్పాట్లు కూడా చేసింది. ఇంతకు ముందు రుణాలు తీసుకోని పరిశ్రమలకు వీటిని ఇస్తారు. వ్యక్తులు, చిన్న పరిశ్రమలు తమ రుణాల చెల్లింపుల వ్యవధిని ఒకసారి మార్చుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com