పోలీసుల కోసం ఆరోగ్య పర్యవేక్షణ కమిటీలు: టి.డీజీపీ మహేందర్ రెడ్డి
- May 05, 2021
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు కమిషనర్ల కార్యాలయాలు, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ల కార్యాలయంలో ఆరోగ్య పర్యవేక్షణ సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా డీజీపీ ఈ నిర్ణయం వెలువరించారు. పోలీసు సిబ్బంది భద్రత కోసం ఈ విభాగం ప్రాధాన్యతనిస్తోందన్నారు. వారిలో విశ్వాసం, సానుకూలత పెంపొందించేందుకు జూమ్ సమావేశాల ద్వారా వారితో సంభాషించడానికి ప్రతి విభాగంలో వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
ఈ బృందంలోని రోగులకు సీనియర్ అధికారులు,స్టేషన్ హౌస్ అధికారులు, వైద్యులు తగిన సలహా ఇస్తారన్నారు.అదేవిధంగా కొవిడ్ కిట్లు, డ్రై ఫ్రూట్స్ ఇవ్వాలని ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు. పోలీసు విభాగంలోని ప్రతి ఒక్క సిబ్బంది హెల్త్ ప్రొఫైల్‌ను సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించిన డీజీపీ ఏవైనా సమస్యలు ఎదురైతే రోగులను సమీప ఆస్పత్రికి తరలించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







