అదిరిపోయే పాలసీ..
- May 06, 2021
ప్రభుత్వ రంగానికి చెందిన దేశీ అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ LIC ఆఫ్ ఇండియా ఎన్నో రకాల పాలసీలు అందిస్తోంది. తక్కువ ప్రీమియంతోనే మంచి రాబడి పొందాలని భావించే వారికి జీవన్ లాభ్ అనే పాలసీ అనువుగా ఉంటుందని చెప్పుకోవచ్చు.
8 ఏళ్ల నుంచి 59 ఏళ్లలోపు వయసు కలిగిన వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. పాలసీ టర్మ్ 25 ఏళ్లు, 21 ఏళ్లు, 16 ఏళ్లుగా ఉంది. మీరు 25 ఏళ్ల పాలసీ టర్మ్ ఎంచుకుంటే 16 ఏళ్లు ప్రీమియం కట్టాలి. 21 ఏళ్ల పాలసీ టర్మ్ ఎంచుకుంటే 15 ఏళ్లు ప్రీమియం చెల్లించాలి. 16 ఏళ్ల పాలసీ టర్మ్ అయితే 10 ఏళ్లు ప్రీమియం కట్టాలి.
అంటే మీరు ఎంచుకునే పాలసీ టర్మ్ కన్నా తక్కువ కాలం ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. పాలసీ తీసుకున్న 3 ఏళ్ల తర్వాత పాలసీపై లోన్ కూడా తీసుకోవచ్చు. కనీసం రూ.2 లక్షల బీమా మొత్తానికి పాలసీ తీసుకోవాలి. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు.
ఉదాహరణకు మీకు 25 ఏళ్లు ఉన్నాయి. మీరు 25 ఏళ్ల టర్మ్‌తో పాలసీ తీసుకున్నారు. మీరు రూ.2 లక్షల బీమా మొత్తానికి పాలసీ తీసుకుంటే.. ఇప్పుడు మీకు నెలకు దాదాపు రూ.800 ప్రీమియం పడుతుంది. మీకు మెచ్యూరిటీ సమయంలో రూ.5 లక్షలకు పైగా లభిస్తాయి.
తాజా వార్తలు
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?
- కువైట్ ఎయిర్పోర్ట్ T5 నుండి డైరెక్ట్ ఫ్లైట్స్.. జజీరా ఎయిర్వేస్
- ఖతార్ లో కమ్యూనిటీ రన్నింగ్ సెషన్లు ప్రారంభం..!!
- సంస్కరణల దిశగా రిమోట్ వర్క్.. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆమోదం..!!
- సాక్ష్యంగా ఈమెయిల్.. BHD11,000 దావా కొట్టివేత..!!
- గూగుల్ పే, ఫోన్ పేలకు పోటీగా వాట్సాప్..
- ప్రధాని మోదీ పై ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు!
- ప్రధాని తెలంగాణ పర్యటనకు ముహుర్తం ఫిక్స్..
- గాజా యుద్ధం తర్వాత తొలి ఎన్నికలలో ఓటు వేయనున్న పాలస్తీనియన్లు









