45 ఏళ్లకు పై బడిన వారికి వ్యాక్సిన్..వ్యాక్సినేషన్ పై ఒమన్ కీలక నిర్ణయాలు

- May 07, 2021 , by Maagulf
45 ఏళ్లకు పై బడిన వారికి వ్యాక్సిన్..వ్యాక్సినేషన్ పై ఒమన్ కీలక నిర్ణయాలు

 ఒమన్: ఆరోగ్య శాఖలోని వైద్య నిపుణుల బృందం జాతీయ వ్యాక్సినేషన్ విధానంపై చర్చించింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జూన్ లో మరో పది లక్షల వ్యాక్సిన్ డోసులు సుల్తానేట్ కు చేరుకుంటాయని, దీంతో జూన్ నెల చివరినాటికి వ్యాక్సిన్ పొందిన వారి సంఖ్య 15 లక్షలకు చేరుకుంటుందని నిపుణల బృందం ప్రకటించింది. తమ తొలి సమావేశంలో సుల్తానేట్ పరిధిలోని ప్రజల రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై కూలకశంగా డిస్కస్ చేశారు. లక్ష్యంగా ఎంచుకున్న వర్గాలతో పాటు 45 ఏళ్లు, అంతకు పైబడిన వారికి కూడా వ్యక్సిన్ అందించనున్నట్లు స్పష్టం చేసింది. అలాగే భక్తులు, పౌరులు, ముసాండం గవర్నరేట్ పౌరులు, ఆరోగ్య కార్యకర్తలు మరియు ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగులు, రాయల్ ఒమన్ పోలీస్, సుల్తాన్ సాయుధ దళాలు, ఉన్నత విద్య, విద్యా సిబ్బంది, పాఠశాలల్లో పన్నెండవ తరగతి విద్యార్థులు, చమురు, గ్యాస్ పరిశ్రమలో కీలక రంగాలు, ఓడరేవులు, విమానాశ్రయాలు మరియు అనేక ప్రైవేటు రంగ సంస్థలు ఇలా అన్ని వర్గాల వారికి వ్యాక్సిన్ అందుతుందన్నారు. ఇందుకోసం సల్తానేట్లోని ఒమన్ కన్వేన్షన్, ఎగ్జిబిషన్ సెంటర్ తో పాటు పలు పలు క్రీడా ప్రాంగణాలు, స్కూల్ ప్రాంతాలను సంసిద్ధం చేయాలని నిర్ణయించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com