పుదుచ్చేరి సీఎంగా రంగస్వామి..ప్రమాణం చేయించిన తమిళి సై
- May 07, 2021
పుదుచ్చేరి: పాండిచ్చేరి సీఎంగా రంగస్వామి శుక్రవారంనాడు ప్రమాణం చేశారు. పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఇవాళ రంగస్వామితో ప్రమాణం చేశారు. రంగస్వామి ఒక్కరే ప్రమాణం చేశారు. మంత్రులు తర్వాత ప్రమాణం చేయనున్నారు. బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు రంగస్వామి మంత్రివర్గంలో చోటు దక్కనుంది. అయితే బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు మంత్రులుగా తర్వాత ప్రమాణం చేసే అవకాశం ఉందని సమాచారం.
పాండిచ్చేరిలో ఆరుగురికి మించి మంత్రివర్గం ఉండకూడదు.కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన నమ:శివాయకు డిప్యూటీ సీఎం పదవి దక్కే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఈ ఏడాది జనవరి మాసంలో నమ:శివాయ కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. ఏప్రిల్ 6న జరిగిన ఎన్నికల్లో ఎఐఎన్ఆర్‌సీ 10 స్థానాలను కైవసం చేసుకొంది. బీజేపీ పోటీ చేసిన 9 స్థానాల్లో ఆరింటిని గెలుచుకొంది. రాష్ట్ర అసెంబ్లీలో 30 స్థానాలున్నాయి. డీఎంకె పోటీ చేసిన 13 అసెంబ్లీ స్థానాల్లో ఆరు స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన 14 స్థానాల్లో రెండు స్థానాల్లో గెలుపొందింది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







