కరోనా బాధితులకు ఇంటికే ఉచిత భోజనం
- May 07, 2021
హైదరాబాద్: తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్న..కేసుల తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు.దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా బాధితులకు తెలంగాణ పోలీసు శాఖ ఉచిత భోజన సదుపాయాన్ని కల్పించనుంది. ఇంట్లో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితులకు ఉచితంగా మధ్యాహ్న భోజనం అందించనుంది. సత్యసాయి సేవా సంస్థ, ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గి, బిగ్ బాస్కెట్, హోప్ సంస్థలతో కలిసి ‘సేవా ఆహార్’ పేరిట పథకాన్ని ప్రారంభించారు. భోజనం అవసరమైన వారు ఉదయం ఏడు గంటల్లోగా 77996-16163 వాట్సాప్ నంబర్‌ను సంప్రదించాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు.హోం ఐసోలేషన్‌లో ఉన్న పిల్లలు, వృద్ధులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు పోలీసు శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







