టీ -20 వరల్డ్ కప్ పై ఐసీసీ కీలక నిర్ణయం..

- May 07, 2021 , by Maagulf
టీ -20 వరల్డ్ కప్ పై ఐసీసీ కీలక నిర్ణయం..

భారత్ లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజు రోజుకి భారీగా కేసుల సంఖ్య పెరుగుతోంది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇక, ఈ మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపై పడింది.ముఖ్యంగా కరోనా కన్ను క్రీడా రంగంపై పడినట్లు ఉంది. ఇప్పటికే.. క్యాష్ రీచ్ లీగ్ కరోనా ప్రభావంతో నిరవధిక పడింది. ప్రపంచ వ్యాప్తంగా చాలా టోర్నీలు రద్దయ్యాయ్.ఇప్పుడు, కరోనా మహమ్మారి కారణంగా పురుషుల టీ20 వరల్డ్‌ కప్‌లో భాగంగా మూడు సబ్‌-రీజినల్‌ క్వాలిఫయర్‌ టోర్నీలను రద్దు చేస్తున్నట్లు ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) ఈ రోజు ప్రకటించింది. ఐసీసీ మెన్స్‌ టీ20 ప్రపంచకప్​ కోసం ఈ అర్హత టోర్నీలను నిర్వహిస్తోంది. అయితే, మూడు క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌ల్లో ఎ, బి క్వాలిఫయర్స్‌ మ్యాచ్‌లు ఫిన్‌లాండ్‌లో జరగనుండగా, వచ్చే రెండు నెలల్లో సి క్వాలిఫయర్స్‌కు బెల్జియం ఆతిథ్యమివ్వాల్సి ఉంది.

కరోనా నేపథ్యంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని మూడు క్వాలిఫయర్లను రద్దు చేయడమే మంచిదని నిర్ణయించినట్లు ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. వీటితో పాటు టీ20 వరల్డ్‌కప్‌​ అమెరికా క్వాలిఫయర్స్​, ఆసియా క్వాలిఫయర్స్​ టోర్నీలు కూడా వాయిదా పడ్డాయి. 2022లో ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్​లో పాల్గొనే చివరి రెండు జట్లను ఈ టోర్నీ ద్వారా ఎంపికచేస్తారు.

మరోవైపు, ఈ ఏడాది భారత్ లో జరగాల్సిన టీ -20 ప్రపంచ కప్ తరలిపోయే అవకాశం ఉంది. కరోనా ఎఫెక్ట్ తో ఈ ఏడాది ధనా ధన్ మెగా టోర్నీ యూఏఈలో జరిగే అవకాశం ఉంది. ఇక, ఐపీఎల్ లోని మిగిలిన మ్యాచ్ల్ని కూడా ప్రత్యామ్నాయ వేదికలపై నిర్వహించడానికి బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఐపీఎల్ నిర్వహించడానికి చాలా దేశాలు క్యూ కడుతున్నాయ్. మేం నిర్వహిస్తే.. మేం అంటూ ముందుకొస్తున్నాయ్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com