తమిళనాడులో సంపూర్ణ లాక్ డౌన్
- May 08, 2021
చెన్నై: భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి.మరణాల సంఖ్య వేలల్లో ఉంటోంది.ప్రతి రోజు 4 లక్షలకు చేరువలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు,వీకెండ్ లాక్ డౌన్ లు,సంపూర్ణ లాక్ డౌన్ వంటి ఆంక్షలు విధిస్తున్నాయి.అయితే తాజాగా తమిళనాడు ప్రభుత్వం కూడా రాష్ట్రంలో సంపూర్ణ లాక్ డౌన్ విధించింది.రాష్ట్రంలో 14 రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నామని, ఈ నెల 10 ఉదయం ఆరు గంటల నుంచి 24 అర్ధరాత్రి వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని తమిళనాడు సర్కార్ పేర్కొంది.కరోనా సెకండ్ వేవ్ లో భాగంగా కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తమిళనాడు ప్రభుత్వం వెల్లడించింది.మే 10 నుంచి నిత్యావసర దుకాణాలు మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే తెరచి ఉంటాయని పేర్కొంది ప్రభుత్వం.
తాజా వార్తలు
- యూఏఈలో 100కు పైగా ఎస్ఎం అకౌంట్స్ బ్లాక్..!!
- కువైట్ బేలోకి ప్రవేశం నిషేధం..!!
- ప్రజలకు అత్యవసర అలెర్ట్ జారీ చేసిన బహ్రెయిన్..!!
- ఒమన్‌లో దంచికొడుతున్న ఎండలు..డాక్టర్ల హెచ్చరికలు..!!
- సౌదీ, GCC పౌరులు మే 3 వరకే అవకాశం..!!
- కార్యాలయ భద్రత, అత్యవసర సంసిద్ధత పై పీహెచ్‌సీసీ ప్రకటన..!!
- తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్
- IPL 2026: ఢిల్లీ పై బెంగళూరు ఘన విజయం
- ఎమిరేట్స్ A380లో స్టార్‌లింక్ వై-ఫై ప్రారంభం
- వందేళ్ల వేడుకలో గుడ్ న్యూస్…ఏయూకి రూ.500 కోట్లు









