కరోనా పాజిటివ్ రిపోర్ట్ లేకున్నా ఆసుపత్రుల్లో చేరవచ్చు: కేంద్రం
- May 08, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది.రోజూ 4 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కోవిడ్ లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలు ఉన్నవారితో పాటు హోం ఐసోలేషన్‌లో ఉన్నవారి కోసం ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే ఆస్పత్రుల్లో చేర్చుకునేలా మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే, ఆస్పత్రుల్లో చేర్చుకునేందుకు కరోనా పాజిటివ్ రిపోర్ట్ అవసరం లేదని కేంద్ర వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. అంతేకాదు, ఆస్పత్రుల్లో చేర్చుకునేందుకు ఎలాంటి గుర్తింపు కార్డు అవసరం లేదని తేల్చి చెప్పింది.ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
కాగా, శుక్రవారం హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి కూడా మార్గదర్శకాలు విడుదల చేసింది కేంద్రం.హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు 10 రోజుల తర్వాత బయటకు రావొచ్చని, చివరి మూడు రోజుల్లో జ్వరం రాకపోతే పరీక్ష అవసరంలేదని కేంద్రం జారీచేసిన కొత్త మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







