న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్ కు 'మెయిల్' సినిమా

- May 08, 2021 , by Maagulf
న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్ కు \'మెయిల్\' సినిమా

హైదరాబాద్: ప్రియదర్శి, హర్షిత్, గౌరీ ప్రియ ప్రధాన పాత్రధారులుగా స్వప్న సినిమాస్ బ్యానర్ లో ప్రియాంక దత్ నిర్మించిన సినిమా 'మెయిల్'. ఓటీటీ కోసం తీసిన ఈ సినిమాను ఈ యేడాది జనవరిలో సంక్రాంతి కానుకగా 'ఆహా'లో స్ట్రీమింగ్ చేశారు. 1980 నేపథ్యంలో సాగే ఈ పల్లెటూరి ప్రేమకథా చిత్రాన్ని యువతరం బాగా ఆదరించింది. కంప్యూటర్ వచ్చిన కొత్తలో ఆ టెక్నాలజీకి అలవాటు పడలేక, దానిని అర్థం చేసుకోలేక కుర్రాళ్ళు పడిన తిప్పలను వినోద ప్రధానంగా దర్శకుడు ఉదయ్ గుర్రాల ఈ చిత్రంలో చూపించాడు. అయితే... ఈ కరోనా పేండమిక్ సిట్యుయేషన్ లో ఈ చిత్ర బృందానికి ఓ తీపి కబురు లభించింది. జూన్ 4 నుండి అమెరికాలో జరుగబోతున్న 'న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్'లో 'మెయిల్' చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు. ఈ విషయాన్ని స్వప్న సినిమా సంస్థ ట్వీట్ చేస్తూ, తన హర్షాన్ని వెలిబుచ్చింది. 'కంబాలపల్లి కథలు' సీరిస్ లో తొలిగా వచ్చిన 'మెయిల్'కు లభించిన ఆదరణను దృష్ట్యా మరి రాబోయే రోజుల్లో మరిన్ని ఓటీటీ చిత్రాలు ఇదే సీరిస్ లో తీస్తారేమో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com