85 శాతం ప్రైవేటు ట్యాక్సీలకు స్మార్ట్ మీటర్ల బిగింపు

85 శాతం ప్రైవేటు ట్యాక్సీలకు స్మార్ట్ మీటర్ల బిగింపు

అజ్మన్ పబ్లిక్ రవాణా అథారిటీ, ప్రైవేటు ట్యాక్సీలకు 85 శాతం స్మార్ట్ మీటర్లను అమర్చే ప్రక్రియను పూర్తి చేసింది. ఈ ఏడాది చివరి నాటికి 100 శాతం స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియ పూర్తవుతుంది. వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ మీటర్ల ఏర్పాటు చేపట్టారు. పబ్లిక్ రవాణా కార్పొరేషన్ అండ్ యాక్టింగ్ లైసెన్సెస్ ఎపిటిఎ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సరాహ్ అహ్మద్ అల్ హోసాని మాట్లాడుతూ, స్మార్ట్ మీటర్లకు ఆప్టికల్ సెన్సార్లు వుంటాయని చెప్పారు. ప్రైవేటు ట్యాక్సీల వేగం తెలుస్తుంది వీటి ద్వారా. మ్యాపులు కూడా పొందుపరిచారు. ప్రయాణీకుల సేఫ్టీ మెకానిజం ఇందులో మరో ప్రత్యేకత. క్యాష్ పేమెంట్లను తగ్గించేలా వీటిని రూపొందించారు. రియల్ టైమ్ విధానంలో డేటా రవాణా జరుగుతుంది. కరోనా నేపథ్యంలో పబ్లిక్ హెల్త్ పరిగననలోకి తీసుకుని పలు చర్యలు చేపట్టారు.

Back to Top