ఐదుగురికి మించి గుమికూడొద్దు..దుబాయ్ హెచ్చరిక
- May 11, 2021
దుబాయ్: అసలే ఇది పండగ సమయం. దీంతో బంధువులు, ఆప్తులు, మిత్రులతో సంతోషంగా గడపాలనుకునే సమయం. కానీ, కోవిడ్ మహమ్మారి పొంచి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తాత్కాలిక సంతోషాల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హితువు చెబుతున్నారు దుబాయ్ పోలీసులు. భౌతిక దూరం పాటించకపోయినా..ఒకే చోట ఎక్కువ సంఖ్యలో గుమికూడిన దాని పరిణామాలు తీవ్రంగా మారే అవకాశాలు లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. ఇక రేపటి నుంచి ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రారంభం అవుతుండటంతో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది.ఒకే చోట ఐదుగురికి మించి ఎక్కువ సంఖ్యలో జనం గుమికూడటంపై నిషేధం విధించింది. ఎవరైనా ప్రార్థనలు, సమావేశాల పేరుతో జనాలను కూడదీస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.నిషేధాన్ని ఉల్లంఘిస్తే కూటమికి ప్రధాన కారకుడికి 50 వేల దిర్హామ్ లు, అందులో పాల్గొన్న ఒక్కొక్కరికి 15,000 దిర్హామ్ ల చొప్పున జరిమానా విధిస్తామని పోలీసులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







