రుయా మృతలకు రూ.10 లక్షల పరిహారం
- May 11, 2021
తిరుపతి: తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక నిన్న రాత్రి 11 మంది మరణించిన సంగతి తెలిసిందే.కోవిడ్ ఆత్యవసర విభాగంలో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కలగడంతో 11 మంది కరోనా రోగులు మృతి చెందారు.ఆక్సిజన్ ఫిల్లింగ్ చేసేపుడు కంప్రజర్ తగ్గటంతో సరఫరాకు అంతరాయం ఏర్పడిందని..దీని కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.అయితే ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇప్పటికే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఇక తాజాగా..రుయా మృతలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు సిఎం జగన్. బాధిత కుటుంబాలకు అన్ని రకాల అండగా ఉంటామని సిఎం జగన్ హామీ ఇచ్చారు. అటు ఈ ఘటనతో ఆక్సిజన్ పై ఏపీ ప్రభుత్వం మరింత ఫోకస్ పెట్టింది.ముగ్గురు సీనియర్ అధికారులకు ఆక్సిజన్ సరఫరా పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం.తమిళనాడు, కర్ణాటక, ఒడిశాలకు ముగ్గురు అధికారులను నియమించింది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







