లాక్ డౌన్ కచ్చితంగా అమలు: సీపీ మహేష్ భగవత్
- May 12, 2021
హైదరాబాద్: నేటి ఉదయం 10 గంటల నుండి లాక్డౌన్ ఏర్పడిన నేపథ్యంలో అమలవుతున్న లాక్ డౌన్ పరిస్థితిని ఉప్పల్, మేడిపల్లి, ఎల్బీ నగర్ పిఎస్ ల పరిధిలలోని చెక్ పోస్ట్ లను రాచకొండ సీపీ మహేష్ భగవత్ పరిశీలించి పోలీసు సిబ్బందికి తగు సూచనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాచకొండ కమిషనరేట్ లో మొత్తం 46చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీసు సిబ్బంది మూడు షిప్టులలో పనిచేయనున్నట్లు సీపీ మహేష్ భగవత్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వేళల్లో లాక్ డౌన్ కచ్చితంగా అమలు చేస్తామని ఆయన అన్నారు.

లాక్ డౌన్ కి ప్రజలు పూర్తి సహకారం అందించాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ కోరారు. వ్యాపార సముదాయాలు ఉదయం పది గంటలకే మూసివేయాలని లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు రైతు బజార్, రేషన్ దుకాణాలు, నిత్యావసర వస్తువుల దుకాణాలు, షాపింగ్ మాల్స్ కి గుంపులుగా వెళ్లకూడదని అన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా రాచకొండ కోవిడ్ కంట్రోల్ రూమ్ నెంబర్ 9490617234 కు ఫోన్ చేయాలని సీపీ కోరారు.

తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







