సినీ సంగీత దర్శకుడు కె.ఎస్.చంద్ర శేఖర్ మృతి
- May 12, 2021
హైదరాబాద్: ప్రముఖ రేడియో, సినిమా సంగీత దర్శకుడు కె.ఎస్.చంద్రశేఖర్ కరోనాతో మృతి చెందారు.ఆయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా రాయలం గ్రామం. ఆయనకు భార్య ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 1990 లో అల్ ఇండియా రేడియో ద్వారా విశాఖపట్నం వాసులకు సుపరిచితులయ్యారు. అల్లురామలింగయ్య నటించిన 'బంట్రోతు భార్య' తో నేపథ్యగాయకునిగా సినిమారంగ ప్రవేశంచేసిన ఈయన సంగీతదర్శకులు చక్రవర్తి వద్ద 70 కి పైగా చిత్రాలకు సహాయకునిగా పని చేసారు. ఆ తర్వాత రమేష్ నాయుడు వద్ద 40 చిత్రాలకు, బాలీవుడ్ లో లక్ష్మీకాంత్ ప్యారేలాల్ వద్ద కొంత కాలం సహాయకునిగా పనిచేసి గీతఆర్ట్స్ చిరంజీవితో నిర్మించిన 'యమకింకరుడు' చిత్రం ద్వారా సంగీత దర్శకునిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత 'బ్రహ్మముడి', 'హంతకుడి వేట', 'ఆణిముత్యం', 'ఉదయం', 'అదిగో అల్లదిగో', 'భోళాశంకరుడు', 'ఆత్మ బంధువులు', 'కంచి కామాక్షి' వంటి 30 కి పైగా చిత్రాలకు సంగీతం సమకూర్చారు. ఇటీవల ఆలిండియా రేడియో గ్రేడ్ 1 మ్యూజిక్ డైరెక్టర్ గా రిటైర్ అయ్యారు. తిరుపతిలో ఈయన ప్రదర్శన చూసి ఘంటసాల హార్మోనియం బహుమతిగా అందించారు. కీరవాణి, కోటి, మణిశర్మ ఈయన దగ్గర శిష్యరికం చేయటం విశేషం. ఆయన మేనల్లుడు మహేంద్ర కూడా చిత్రపరిశ్రమలో మేనేజర్ గా, నిర్మాతగా కొనసాగుతున్నారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







