పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు..
- May 13, 2021
జెరూసలేం: పాలస్తీనా,ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.రెండు దేశాల పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.ఒకరిపై ఒకరు బాంబు దాడులు చేసుకున్నాయి.దీంతో గాజాలో సోమవారం నుంచి ఇప్పటివరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 40 మందికి పైగా పెరిగిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది.మొత్తంగా ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 86 మంది చిన్నారులు, 39 మంది మహిళలు సహా దాదాపు 300 మంది గాయపడ్డారు. 2014 తర్వాత ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య భీకర పోరు కొనసాగుతోంది. పాలస్తీనా ఉగ్రసంస్థ హమాస్, ఇతర ఉగ్ర సంస్థల అధీనంలోని గాజా సిటీ నుంచి పాలస్తీనా మీదకు, పాలస్తీనా నుంచి గాజా సిటీ వైపునకు లెక్కకు మించిన రాకెట్లు దూసుకొస్తున్నాయి. ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా రాకెట్ల వర్షం కురిస్తామని హమాస్ కమాండర్లు ప్రకటించిన వీడియో దృశ్యాలను ఇజ్రాయెల్ టీవీ చానళ్లు ప్రత్యక్ష ప్రసారంచేశాయి. కాగా ఇజ్రాయెల్ దాడిలో భారత సంతతికి చెందిన కేరళ మహిళ మృతి చెందింది. ఆమె మృతి పట్ల ఇజ్రాయెల్ రాయభార కార్యాలయం సంతాపం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







