వ్యాక్సిన్ తీసుకుంటే క్వారంటైన్ మినహాయింపు గడువు పెంపు
- May 13, 2021
దోహా: వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేసిన ఖతార్ ప్రభుత్వం..మరింత ఎక్కువ సంఖ్యలో ప్రజలు వ్యాక్సిన్ తీసుకునేలా ప్రొత్సహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. వ్యాక్సిన్ తీసుకోవటం ద్వారా పలు నియంత్రణల నుంచి మినహాయింపు పొందవచ్చని చెబుతోంది. వ్యాక్సిన్ తీసుకున్న వారికి 6 నెలల పాటు క్వారంటైన్ నిబంధనలు వర్తించవని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే..ఇప్పుడా మినహాయింపు గడువును ఆరు నెలల నుంచి 9 నెలలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లి(ఆరు దేశాలు మినహా) తిరిగొచ్చినా క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం లేదని తెలిపింది. అయితే..ఇది రెండు డోసుల కోర్సు పూర్తి చేసి 14 రోజులు ముగిసిన వారికి మాత్రమే వర్తిస్తుందని కూడా స్పష్టత ఇచ్చింది. ఇక ఈద్ అల్ ఫితర్ తర్వాత 30 ఏళ్లకు పైబడిన వారికి కూడా వ్యాక్సిన్ అందించనున్నట్లు ఖతార్ వెల్లడించింది. 12-15 ఏళ్ల మధ్య వయస్కులు కూడా నిర్భయంగా వ్యాక్సిన్ తీసుకోవచ్చని పిలుపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో సైంటిఫిక్ గా కూడా ఫైజర్ బయోన్టెక్ వ్యాక్సిన్ ప్రభావశీలతను చాటుకున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అభిప్రయాపడింది. పిల్లలకు వ్యాక్సిన్ ఇప్పించటం వల్ల స్కూల్ నిర్వహణ సాఫీగా సాగుతుందని, వీలైనంత తక్కువ నియంత్రణల నడుమ స్కూల్స్ కు వెళ్లే అవకాశం దొరుకుతుందని, అందుచేత 12-15 వయసు పిల్లలకు వారి తల్లిదండ్రులు వ్యాక్సిన్ వేయించాలని ఖతార్ కోరింది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







