జూన్ 19 నుంచి ప్రారంభం కానున్న ఫిఫా అరబ్ కప్ క్వాలిఫైయింగ్ పోటీలు
- May 13, 2021
జ్యురిచ్: అంతర్జాతీయ ఫుట్ బాల్ అసోసియేషన్ (ఫిఫా) వెల్లడించిన వివరాల ప్రకారం ఫిఫా అరబ్ కప్ ఖతార్ 2021 క్వాలిఫైయింగ్ పోటీలు జూన్ 19 నుంచి 25 వరకు జరగనున్నట్లు తెలుస్తోంది. ఫిఫా అరబ్ కప్ ఖతార్ 2021 పోటీలు డిసెంబర 1 నుంచి 18 వరకు (2021) దోహాలో జరుగుతాయి. మొత్తం 23 అరబ్ టీములు రెండు కేటగిరీల కింద విభజించబడ్డాయి. మొదటి కేటగిరీలో ఫిఫా వరల్డ్ ర్యాంకింగ్స్ పరంగా టాప్ 9లో వున్న జట్లు ట్యునీసియా, అల్జీరియా, మొరాకో, ఈజిప్ట్, హోస్ట్స్ ఖతార్, సౌదీ అరేబియా, ఇరాక్, యూఏఈ మరియు సిరియా వున్నాయి. రెండో కేటగిరీలో ఒమన్, లెబనాన్, జోర్డాన్, బహ్రెయిన్, మారిటానియా, పాలస్తీన్, లిబియా, సుడాన్, సౌత్ సుడాన్, ద్జిబౌతి, సోమాలియా, కామరోస్, యెమెన్, కువైట్, వున్నాయి. లిబియా మరియు సుడాన్ మధ్య జూన్ 19న పోటీ జరుగుతుంది. తరువాతి రోజు ఒమన్ - సోమాలియా మధ్య పోటీ జరుగుతంుది. మూడో గ్రూపులో అంతకు ముందు విజయాలు సాధించిన జట్ల మధ్య జరుగుతాయి.
తాజా వార్తలు
- 10 వేలకు పైగా విమాన సర్వీసులు నిలిపివేత
- ఇరాన్లో భారతీయులకు కేంద్రం అత్యవసర అలర్ట్..
- చమురు నిల్వలకు నెలవైన ఖర్గ్ ద్వీపం పై అమెరికా దాడులు
- అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో ముగిసిన ఎన్నికల ప్రచారం
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్‌పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్‌లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS
- సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!









