జులై నుంచి 'లూసిఫర్' రీమేక్
- May 14, 2021
హైదరాబాద్: 'ఆచార్య' తర్వాత చిరంజీవి చేయబోతున్న సినిమా 'లూసిఫర్' రీమేక్. మలయాళంలో ఘన విజయం సాధించిన ఈ సినిమా అప్ కమింగ్ టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ లలో ఒకటి. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకుడు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ తో పాటు ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. నిజానికి ఈ సినిమా 'సాహో' దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో రూపొందుతుందని భావించారు. ఆ తర్వాత వివి వినాయక్ పేరు వినిపించింది. ఎందుకో ఏమో తను కూడా తప్పుకున్నాడు. మోహన్ రాజా చెప్పిన నేరేషన్ నచ్చటంతో పూజ కూడా జరిపారు. కరోనా కారణంగా అన్ని సినిమాల షూటింగ్ లు ఆగిపోయాయి. పరిస్థితి ఈ నెలాఖరుకు చక్కబడుతుందని భావిస్తున్నారు. జూలై నుంచి ఈ పొలిటికల్ డ్రామా షూటింగ్ మొదలవుతుందట. ప్రస్తుతం రన్నింగ్ లో ఉన్న 'ఆచార్య' ఆ తర్వాత 'లూసిఫర్' రీమేక్ పూర్తి కాగానే 'వేదాళం' రీమేక్ పట్టాలెక్కుతుందట.
తాజా వార్తలు
- డోనాల్డ్ ట్రంప్ కొత్త స్కీమ్..
- జల వివాదాల పై రాష్ట్రాలకు ప్రధాని మోదీ కీలక సూచన
- ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’తో రాష్ట్రాల మధ్య సాంస్కృతిక బంధం బలోపేతం: గవర్నర్ శుక్లా
- గోదావరి-కావేరి అనుసంధానం పై కేంద్రం యోచన: సీఎం చంద్రబాబు
- ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధి: సీఎం రేవంత్
- BD50,000 తమ్కీన్-SIO ఫ్రాడ్.. ఐదుగురికి జైలు శిక్ష..!!
- బేస్మెంట్, అసురక్షిత పార్టిషన్ లపై ఫైర్ ఫోర్స్ హెచ్చరిక..!!
- ఒమన్‌ను హెచ్చరించిన ట్రంప్..!!
- ఖతార్ వ్యాప్తంగా ఈద్ వేడుకలు..!!
- సౌదీలో 10 మంది ఉల్లంఘనదారులకు భారీ జరిమానా..!!









