తెలంగాణ ప్రభుత్వ సర్క్యులర్ పై హైకోర్టు స్టే
- May 14, 2021
హైదరాబాద్: ఏపీ-తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్సుల నిలిపివేతపై తెలంగాణ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.అలా అంబులెన్సులను ఆపే హక్కు ఎవరిచ్చారని రాష్ట్ర ప్రభుత్వం పై హైకోర్టు మండిపడింది.రాష్ట్ర సరిహద్దుల్లో ఆంబులెన్స్ లో నిలిపివేస్తున్నారంటూ రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి వెంకట కృష్ణారావు దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై ఉన్నత న్యాయస్థాన విచారణ చేపట్టింది. వాహనాలను ఆపి ఆర్టికల్ 21 ను ఉల్లంఘిస్తున్నారని కోర్టు అభిప్రాయపడింది.పేషంట్ లతో వెళ్తున్న అంబులెన్సులను ఆపడం ఎక్కడైనా చూశామా అని హైకోర్టు ప్రశ్నించింది.అటు ఈ నెల 11వ తేదీన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ పై హైకోర్టు స్టే విధించింది.తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఆదేశాలు అమల్లో ఉంటాయని హైకోర్టు వెల్లడించింది.తదుపరి విచారణను జూన్ 17కి వాయిదా వేసింది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







