దుబాయ్ టిఓఐఎఫ్‌ఎలో షారుక్, సల్మాన్ సందడి
- March 04, 2016
టైమ్స్ ఆఫ్ ఇండియా ఫిలిం అవార్డ్స్ సెకెండ్ ఎడిషన్ మార్చ్ 18న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, దుబాయ్ స్పోర్ట్స్ సిటీలో జరగనుంది. ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ ఈవెంట్‌లో షారుక్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, వరుణ్ ధవన్, కరీనాకపూర్, జాక్వెలైన్ ఫెర్నాండెజ్, యోయో హనీ సింగ్ సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు డాన్స్, సింగింగ్ ప్రదర్శనలతో సందడి చేయనున్నారు. స్పెషల్ ప్యానెల్ మరియు, పబ్లిక్ పాపులర్ ఛాయిస్ ద్వారా అవార్డు విజేతల్ని ప్రకటిస్తారు ఈ వేదికపైన. వరుణ్ ధవన్ మాట్లాడుతూ, టిఓఐఎఫ్ తనకు తొలిసారిగా అవకాశం కల్పించిన వేదిక అనీ, బెస్ట్ డిబటెంట్ యాక్టర్ కేటగిరీలో 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాకి అవకాశం దక్కిందని చెప్పాడు. అద్భుతమైన ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తామని ఆహూతులకు ఈ సందర్భంగా వరుణ్ భరోసా ఇచ్చాడు. టిఓఐఎఫ్ సెకెండ్ ఎడిషన్‌లో తానూ భాగమైనందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పంది బాలీవుడ్ భామ జాక్వెలైన్ ఫెర్నాండెజ్. ఇండియా, బహ్రెయన్, కెఎస్‌ఏ, ఖతార్ ఒమన్ మరియు యూకేకి చెందిన అభిమానులు పెద్ద సంఖ్యలో దుబాయ్‌కి ఈ కార్యక్రమం కోసం రానున్నారు. తొలి ఎడిషన్ టిఓఐఎఫ్‌ఎ వాంకోవర్, బ్రిటిష్ కొలంబియా, కెనడాల్లో 40,000 మంది ఆడియన్స్ సమక్షంలో నిర్వహించింది.
ఈ కార్యక్రమానికి ఇవెంట్ ఆర్గనైసర్ గా ఇవెంట్జ్ అన్లిమిటెడ్ వారు వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







