మనోజ్ కుమార్ ను వరించిన 'దాదాసాహెబ్ ఫాల్కే' అవార్డు ..!!
- March 04, 2016
ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు, నిర్మాత మనోజ్ కుమార్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకోనున్నారు. హరియాలీ ఔర్ రాస్తా, ఓ కౌన్ థీ, హిమాలయా కీ గోద్ మే, రోటీ కపడా ఔర్ మకాన్, క్రాంతి వంటి సినిమాలతో మనోజ్ కుమార్ ఎంతో గుర్తింపును తెచ్చుకున్నారు. తన సినిమాల్లో మనోజ్ దేశభక్తిని ఎక్కువగా చూపించేవారు. దేశభక్తి సినిమాల విషయాన్ని తాము ఆయన నుంచే తాము నేర్చుకున్నామని ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ట్వీట్ చేశారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినందుకు ఆయనకు అభినందనలు చెప్పారు.2015 సంవత్సరానికి గాను 47వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు మనోజ్కుమార్ను ఎంపిక చేసినట్లు ఎంఐబీ ఇండియా ఓ ట్వీట్ లో తెలిపింది.
సినీ పరిశ్రమ అభివృద్ధికి అద్భుతకృషి చేసినందుకు, ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నందుకు భారత ప్రభుత్వం అందించే ఈ అవార్డుకు ఈ సారి మనోజ్ కుమార్ ఎంపికయ్యారు. ఉపకార్ సినిమాకి నేషనల్ ఫిల్మ్ అవార్డును అందుకున్న ఆయన.. 1992 లో భారత ప్రభుత్వం అందిచే పద్మశ్రీ పురస్కారాన్ని కూడా పొందారు.
తాజా వార్తలు
- తెలంగాణలో 5 రోప్వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!







