కాబూల్ మసీదులో పేలుడు...12 మంది మృతి
- May 14, 2021
కాబూల్: ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ శివార్లలో మసీదులో జరిగిన పేలుడులో 12 మంది మరణించారు.ఈద్ సందర్భంగా శుక్రవారం వీరందరూ ప్రార్ధనలు చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పాఠశాలలో పేలుడు సంభవించి 80మంది చనిపోయిన ఘటన జరిగి వారం కూడా తిరగకముందే మసీదులో పేలుడు చోటుచేసుకుంది.రంజాన్ సందర్భంగా మూడు రోజుల పాటు కాల్పుల విరమణను ప్రకటించిన తాలిబన్ ఈ దాడిని తీవ్రంగా ఖండించింది.ఈ పేలుడుకు తమదే బాధ్యత అని ఇంతవరకు ఏ సంస్థ ప్రకటించకపోవడం గమనార్హం.కాబూల్ పోలీసుల ప్రతినిధి ఫార్మారజ్ మాట్లాడుతూ, మరణించిన వారిలో మసీదు ఇమామ్ కూడా వున్నారని తెలిపారు. మరో 15 మంది గాయపడ్డారని చెప్పారు. పాఠశాలపై దాడి చేసింది ఇస్లామిక్ స్టేట్ వంటి ప్రత్యర్థి మిలిటెంట్ గ్రూపే అయి వుంటుందని అమెరికా భావిస్తోంది.
తాజా వార్తలు
- బాసర ఆలయాభివృద్ధి పనులకు సీఎం రేవంత్ భూమిపూజ |
- ఖతార్ ప్రధానికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్
- ఏప్రిల్ 10 నుంచి యూపీఐ తప్పనిసరి
- తారామతి బారాదరిలో ‘మోర్ దేన్ ఫ్రెండ్స్’ పార్టీ పై ఈగల్ పోలీసుల దాడులు
- భారత్-ఇజ్రాయెల్ విమాన సర్వీసుల నిలిపివేత
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!









