బాసర ఆలయాభివృద్ధి పనులకు సీఎం రేవంత్ భూమిపూజ |
- April 06, 2026
బాసర: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సోమవారం నిర్మల్ జిల్లాలోని బాసర క్షేత్రాన్ని సందర్శించారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆయన, జ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో తన మనవడికి అక్షరాభ్యాసం చేయించారు.ఈ వేడుకలో రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ మరియు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
అమ్మవారి దర్శనం అనంతరం బాసర ఆలయ విస్తరణ మరియు సమగ్ర అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు. యాదాద్రి తరహాలో బాసరను కూడా ఆధ్యాత్మికంగా, పర్యాటక పరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. భక్తులకు అవసరమైన వసతులు, ఆలయ ప్రాంగణ విస్తరణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా అర్చకులు సీఎం రేవంత్ రెడ్డికి వేదాశీర్వచనం అందించి, అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







