కోవిడ్‌తో అనాథలైన చిన్నారులకు రూ.10 లక్షలు
- May 17, 2021
అమరావతి: కరోనా మహమ్మారి ఏకంగా కుటుంబాలను.. కుటుంబాలనే కబలించేస్తోంది.కుటుంబంలోని పెద్దలతో పాటు.. ఈ కుటుంబానికి సర్వం తానై చేసుకునే యువకులను కూడా కోవిడ్ బలితీసుకుంది.తల్లిదండ్రులు కోల్పోయి చాలా మంది చిన్నారులు అనాథులుగా మిగిలిపోతున్నారు.తాము ఉన్నామంటూ చేరదీసేవారు లేని పరిస్థితులు ఉన్నాయి. అయితే, కోవిడ్ కారణంగా అనాథలైన చిన్నారులకి ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.కోవిడ్ తో అనాథలైన చిన్నారుల పేరు పై రూ.10 లక్షల చొప్పున ఫిక్స్‌డ్ డిపాజిటివ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఈ మొత్తంపై వచ్చే వడ్డీని ఆ చిన్నారులు నెలనెల తీసుకునే వీలు కల్పించేలా చర్యలు తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది.ఆ చిన్నారులకు 20 ఏళ్లు నిండిన తర్వాత ఎఫ్‌డీ మొత్తాన్ని అందించేలా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.దీనికి సంబంధించిన ఉత్తర్వులు రేపటిలోగా విడుదల చేయనుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







