సౌదీ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు షురూ
- May 18, 2021
సౌదీ: కోవిడ్ ఎఫెక్ట్ తో సౌదీ నుంచి తాత్కాలికంగా నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సర్వీసులు ఎట్టకేలకు పున:ప్రారంభం అయ్యాయి. ఇవాళ్టి నుంచి 30 దేశాల్లోని 43 అంతర్జాతీయ విమానాశ్రయాలకు తమ సర్వీసులను నడుపుతున్నట్లు సౌదీ జాతీయ విమానయాన సంస్థ సౌదీ అరేబియన్ ఎయిర్ లైన్స్ ప్రకటించింది. కింగ్డమ్ లోని రియాద్, జెడ్డా నగరాల నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ను ఆపరేట్ చేయనున్నట్లు ఎయిర్ లైన్స్ అధికారులు వెల్లడించారు. రియాద్ నుంచి ప్రతీ వారం 153 ఫ్లైట్స్, జెడ్డా నుంచి 178 ఫ్లైట్స్ ను నడపనున్నట్లు వివరించారు. అయితే..విమాన సర్వీసుల పున:ప్రారంభం తర్వాత రియాద్ నుంచి ఎగిరే తొలి విమానం హైదరాబాద్ కు రానుండగా, జెడ్డా నుంచి ఢాకాకు తొలి విమానం టేకాఫ్ కానుంది. అలాగే రియాద్ కు కైరో నుంచి జెడ్డాకు జకార్త నుంచి తొలి ఫ్లైట్స్ ల్యాండ్ కానున్నాయి.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







