7 కమర్షియల్ కాంప్లెక్స్ లు, ఫిష్ మార్కెట్లో నేడు వ్యాక్సినేషన్

7 కమర్షియల్ కాంప్లెక్స్ లు, ఫిష్ మార్కెట్లో నేడు వ్యాక్సినేషన్

కువైట్: కోవిడ్ నియంత్రణకు వ్యాక్సినేషన్ను ముమ్మరం చేస్తున్న కువైట్..మొబైల్ యూనిట్లతో క్షేత్ర స్థాయికి వెళ్లి మరీ వ్యాక్సిన్ ఇస్తోంది. ముఖ్యంగా ప్రజలతో కాంటాక్ట్ అయ్యే రంగాల్లోని ఉద్యోగులను ఎంపిక చేసి మొబైల్ యూనిట్ల ద్వారా వ్యాక్సిన్ అందిస్తోంది. ఇందులో భాగంగా 7 కమర్షియల్ కాంప్లెక్స్ లతో పాటు ఫిష్ మార్కెట్ లో  దాదాపు 8000 మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. బౌలేవార్డ్, సింఫనీ మాల్, ముహల్లాబ్ మాల్, లైలా గ్లేరీ, ఫనార్ కాంప్లెక్స్, అల్-జహ్రా అవ్తాడ్ కాంప్లెక్స్, జహ్రా మాల్ కాంప్లెక్స్‌ లకు మొబైల్ యూనిట్లు తరలిస్తున్నట్లు ప్రాథమిక ఆరోగ్య అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ వివరించారు. అలాగే ఫిష్ మార్కెట్‌లోని కార్మికులకు కూడా తమ మొబైల్ యూనిట్లు వ్యాక్సిన్ అందిస్తాయన్నారు. ఇదిలాఉంటే..ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఆయా కాంప్లెక్స్ లలో 35,000 నుంచి 36,000 మందికి వ్యాక్సిన్ అందినట్లు అవుతుందన్నారు. ఇక ఎయిర్ పోర్టులతో పాటు వినియోగదారు వస్తు ఉత్పత్తులు చేసే కంపెనీలు, ఫ్యాక్టరీలలో మూడో విడత వ్యాక్సినేషన్ నిర్వహిస్తామని వెల్లడించారు.

Back to Top