జూనియర్ డాక్టర్లకు 15 శాతం స్టైఫండ్ పెంపునకు ఆదేశాలు - కేసీఆర్ సర్కార్
- May 18, 2021
హైదరాబాద్: జూనియర్ డాక్టర్ల వేతనాలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదేశించారని మంత్రి కేటీఆర్ తెలిపారు. తమ వేతనాలు పెంచాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్లు ప్రభుత్వానికి లేఖ రాశారు. గత ఏడాది కరోనా సమయంలో కూడ జూనియర్ డాక్టర్లు కూడ తమ డిమాండ్ల విషయమై నిరసనకు దిగిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించింది. కరోనా రెండో వేవ్ సమయంలో కూడ తమ డిమాండ్లను పరిష్కరించాలని జూనియర్ డాక్టర్లు కోరారు.
ఈ విషయమై జూనియర్ డాక్టర్లు ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ ను కోరారు. ఈ డిమాండ్ ను మంత్రి కేటీఆర్ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. హౌస్ సర్జన్, పీజీల స్టైఫండ్ 15 శాతం పెంచాలని కేసీఆర్ హెల్త్ సెక్రటరీకి మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేశారు. ఇవాళే ఈ విషయమై జీవోను విడుదల చేయనున్నట్టుగా మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







